MDK: చేగుంటలో సోమవారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, రూ.58,060 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట రాయుళ్లను, నగదు, మొబైల్ ఫోన్లు చేగుంట పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు