VKB: దీపావళి పండుగ సందర్భంగా వికారాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. సోమవారం ప్రధాన రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయి మార్కెట్లు కళకళలాడాయి. పువ్వులు, టపాసులు, గుమ్మడికాయలు, దీపాలు కొనుగోలు చేయడంలో ప్రజలంతా నిమగ్నమయ్యారు. గుమ్మడికాయ రూ.150, బంతిపూలు రూ.50 వరకు కొనుగోలు చేస్తూ, చిన్నారులకు టపాసులను కొనిపెట్టడంలో ప్రజలు ఉత్సాహం చూపించారు.