VZM: తెర్లాం మండలం రంగప్పవలస గ్రామంలోని మంచినీటి కోనేరును సోమవారం గ్రామస్థులు శుభ్రం చేశారు. కార్తీక మాసం స్నానాలు, అయ్యప్ప, శివ మాలధారణ భక్తులకు స్నానం చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమం చేపట్టామని సర్పంచ్ ఎస్. రాంబాబు తెలిపారు. గ్రామస్థులు కోనేరులోని పిచ్చి మొక్కలు, బురదను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.