E.G: దీపావళిని పురస్కరించుకుని కడియపులంక గ్రామ దేవత శ్రీ ముసలమ్మ అమ్మవారికి భక్తులు సోమవారం 60 రకాల తీపి పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు. సుమారు 200 కేజీల స్వీట్స్‌తో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ముసలమ్మ శుక్రవారం వరకు ఈ స్వీట్స్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆ రోజు సాయంత్రం వాటిని భక్తులకు పంపిణీ చేస్తారు.