KMM: వేంసూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై కవిత సిబ్బందితో దాడులు నిర్వహించినట్లు సోమవారం తెలిపారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు అనుమతులు లేకుండా తరలిస్తున్న ఓ లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.