ATP: గుంతకల్లు రోడ్డులో రోడ్డు విస్తరణ పనులకు సోమవారం ఆర్అండ్బీ, నేషనల్ హైవే అధికారులు శ్రీకారం చుట్టారు. గాంధీ సర్కిల్ వద్ద నుంచి ఎంఎస్ డిగ్రీ కళాశాల సమీపం వరకు రోడ్డుకు కుడి పక్కన ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు స్వచ్ఛందంగా దుకాణాలు తొలగిస్తున్నారు. బుధవారం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.=