సత్యసాయి: రొద్దం మండలంలోని కలిపి గ్రామంలో కురుబ కులస్థులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని కురుబ కులస్థులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజినప్ప, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.