KMR: జుక్కల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం గంటన్నర పాటు వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి లక్ష్మీ పూజల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ప్రజలు, ప్రయాణికులు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు. రోడ్లపై ఆరబోసి ఉంచిన సోయాబీన్ పంట తడిచిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.