NLR: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమశిల నుంచి వరద వచ్చే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో పెన్నా తీరం వెంట ఉన్న కోవూరు నియోజకవర్గ ప్రజల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ఫోన్లో ఆమె మాట్లాడారు. ప్రజల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు.