MBNR: మిడ్జిల్ నుంచి వెల్జాల్ వెళ్లే ప్రధానరహదారి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన వేములకు చెందిన తిరుపతిగౌడ్ స్పందించారు. తన సొంత ఖర్చులతో సోమవారం రెండు జేసీబీలు ఏర్పాటు చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చి, రోడ్డుకు ఇరువైపులా కంప చెట్లను తొలగించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.