SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ తోనే పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. సోమవారం నిమ్మడ క్యాంప్ కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.7 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.