BDK: చర్ల మండలం దేవరపల్లి గ్రామంలో తెల్లం లక్ష్మీనర్సు అనారోగ్యంతో మరణించారు. సోమవారం వారి పార్థివ దేహానికి పూలమాల వేసి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నివాళులు అర్పించారు. లక్ష్మీనర్సు మరణం బాధాకరమని, వారి కుటంబానికి తన ప్రగాడ సానుభూతిని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో వీరి కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.