NRML: ముధోల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముధోల్ నుండి బాసర కుబీర్ బైంసా లోకేశ్వరం తదితర గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. దీంతో అటువైపుగా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేయించాలని ప్రయాణికులు సోమవారం ఓ ప్రకటనలో కోరారు.