VSP: వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సింహాచలంలో నిత్య అన్నప్రసాదం పథకానికి హైదరాబాద్కు చెందిన వై. మహేష్, శ్రీమతి గాయత్రి దంపతులు రూ.1,01,116 చెక్కు రూపంలో సోమవారం విరాళం అందించారు. ఆలయ సహాయకార్య నిర్వహణ అధికారి కే. తిరుమలేశ్వరరావు దానాన్ని స్వీకరించారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం కల్పించి, శేష వస్త్రాలతో సత్కరించారు.