SRD: పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్లో 69వ రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను దిగ్విజయంగా నిర్వహించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు పట్లోళ్ల హనుమంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వాములు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఈ పోటీలో 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు,1500 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు తెలిపారు.