ATP: డి.హీరేహళ్ మండలం మురడిలో నాగవేణి(35)ని భర్త హనుమంతరాయుడు చంపిన విషయం తెలిసిందే. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల నుంచి హనుమంతరాయుడు మానసికంగా బాధపడేవాడని, ఈ క్రమంలో కోపోద్రిక్తుడై సోమవారం ఉదయం నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపినట్లు వెల్లడించారు.