ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బలోచిస్తాన్‌ను దేశంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక హిందీ సినిమాను సౌదీలో విడుదల చేస్తే అది కచ్చితంగా సూపర్‌హిట్ అవుతుందని పేర్కొన్నారు. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలైనా ఇక్కడ రూ.వందల కోట్లు సాధిస్తాయన్నారు. ఎందుకంటే బలోచిస్తాన్, ఆఫ్గాన్, పాక్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు అని పేర్కొన్నారు.