MHBD: తొర్రూరు మండలం దుబ్బతండా గ్రామ శివారులోని వైకుంఠధామం నిరుపయోగంగా మారింది. వైకుంఠధామ ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలని స్థానికులు ఇవాళ కోరారు.