WNP: హజ్రత్ షేక్ అలీ షా తాతయ్య ఉర్సు ఉత్సవాల సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం సాయంత్రం దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ షకీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.