VKB: ధారూర్ మండలంలోని దోర్నాల్, నాగారం, కుమార్పల్లి, అంపల్లి, మైలారం గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షాలతో పంటలు పాడవుతున్నాయని రైతులు వాపోయారు. వర్షం కొనసాగితే పత్తి, మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.