KDP: రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు దేశానికి వెన్నెముకని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఏడ్చిన రాజ్యం – ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవన్నారు. కూటమి పాలనలో రైతు ప్రతిరోజు ఏడుస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. రైతుల ముఖాల్లో దీపావళి కాంతులు, వెలుగులు, పండుగ సంతోషం, పండుగ వాతావరణం కనిపించడం లేదన్నారు.