MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోన్నాయిల మహేష్‌కు టెన్త్ స్నేహితులు ఆర్థిక సహాయం అందజేశారు. మహేష్ బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకోగా రూ.12 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో 2006 బ్యాచ్ కిష్టాపూర్ జడ్పీ పాఠశాల టెన్త్ స్నేహితులు సోమవారం ఆయనను పరామర్శించి రూ.27 వేల ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో సురేందర్, ఎర్ర సంపత్, డా.సతీష్, శశి కుమార్ పాల్లొన్నారు.