AP: మంగళగిరి సమీపంలోని వెంటకపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లానని తెలిపారు. దేవుడి అలంకరణ నుంచి సిబ్బంది తీరు వరకు నిర్లక్ష్యం కనిపించిందని అసహనం వ్యక్తం చేశఆరు. ఇకపై ప్రతి శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శిస్తానని తెలిపారు.