టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న మూవీ ‘మోగ్లీ’. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 24న ‘సయ్యారే’ పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ పంచుకున్నారు. ఇక దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది.