AP: రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంతో సంతృప్తిగా ఉన్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. వైసీపీ మాత్రం రాజకీయంగా కష్టాల్లోకి దిగజారుతోందని అన్నారు. తన ప్రభుత్వంలో 4 డీఏలు ఎందుకు ఇవ్వలేదో జగన్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క డీఏ అయినా ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.