అత్యుత్తమ టెలికం సేవలున్న అగ్ర దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ‘నాణ్యతా ప్రమాణాలను పెంచెందుకు, పర్యవేక్షించేందుకు ఈ నెల 1నుంచి మరిన్ని నిబంధనలను అమల్లోకి తీసుకుని వచ్చాం. వైఫై విస్తృతిని పెంచేందుకు 6 GH బ్యాండ్ స్పెక్ట్రంలో కొన్ని ఫ్రీక్వెన్సీలకు లైసెన్సు నుంచి మినహాయింపునిచ్చినట్లు తెలిపారు.