ASF: జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వం తొలిసారి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 23వ వరకు పొడిగించింది. 2023-25 టెండర్లలో 1,022 దరఖాస్తులతో రూ.20.44 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-27కు శనివారం వరకు 622 దరఖాస్తులకు రూ.18.66 కోట్ల ఆదాయం లభించింది. గత టెండర్లతో పోల్చితే 400 దరఖాస్తులు తగ్గాయి.