VKB: కొడంగల్ పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆధునిక సౌకర్యాలు, ఉద్యోగులకు అవసరమైన వనరులతో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. ఈ నూతన భవనం పట్టణ పరిపాలనలో సమర్థవంతమైన సేవలను అందిస్తుంది. ఉద్యోగులు సజావుగా పని చేయడానికి అనువైన గదులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. త్వరలోనే కార్యాలయ ప్రారంభం కానుంది.