TG: దీపావళి సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదని ఆయన అన్నారు. సీఎం వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ, ప్రజలకు భద్రత కరువైందని ఆరోపించారు. HYDలో గూండారాజ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.