SKLM: కంచిలి మండలం చోట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో ఎంఈవో శివప్రసాదరావు పాములు పట్టే యువకుడిని సోమవారం పాఠశాలలో జాయిన్ చేశారు. పాములు పడితే భవిష్యత్తు పాడవుతుందని, చదువుకుంటే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలో జాయిన్ చేశారు. పిల్లాడి పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని హెచ్ఎం తిరుపతిరావుకు సూచించారు.