KDP: సిద్ధవటం మండలం కనుమల్లో పల్లె సమీపంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనపై కడప రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.