ATP: ‘కె-ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం నేడు అనంతపురానికి రానున్నారు. నగరంలోని గౌరీ థియేటర్లో సోమవారం సాయంత్రం 6 గంటలకు అభిమానులతో కలిసి సినిమా చూడనున్నారు. ఫస్ట్ షో ముగిసిన అనంతరం కర్నూలుకు వెళ్తారని హీరో సిబ్బంది తాజాగా తెలిపారు. కాగా.. ‘కె ర్యాంప్’ సినిమా అక్టోబర్ 18న విడుదలైన విషయం తెలిసిందే.