కృష్ణా: దీపావళి సందర్భంగా మచిలీపట్నం నేషనల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బాణసంచా స్టాల్స్ వద్ద ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ.. పోలీసులు క్రమబద్ధంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రమాదాలు జరగకుండా ఈరోజు ముందస్తు చర్యలు చేపట్టారు.