PPM: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆదివారం పేలుడు ఘటన జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. విజయనగరం నుంచి పార్వతీపురంకు పార్సెల్ బుక్ చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్టీసీ కార్గో పార్సెల్ నిషేధిత వస్తువులు బుక్ చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇకమీదట అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచుతామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.