RR: శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీబ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ నటుడు చిన్నా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండగ రోజున స్వామివారి సన్నిధిలో పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని వారు పేర్కొన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి చిన్నాను సత్కరించి చిత్రపటాన్ని బహుకరించారు.