KMM: మధిరలో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించి 8 నెలలు గడుస్తున్నా పూర్తికాలేదని సోమవారం స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ అడ్డగోలుగా తవ్వి వదిలివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరితగతిన డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కోరారు.