మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ ఊర గుట్ట ప్రాంతంలో గత 4 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక యువ నాయకుడు చింతకింది శ్రీనివాస్, ఎర్ర లక్ష్మణ్ సోమవారం ట్యాంకర్లను తెప్పించి నీటి కష్టాలను తీర్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారికి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు.