టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులడు, ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు మృతిపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సుబ్బనాయుడు ఎంతో కృషి చేశారన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.