HYD నగరంలో సీజన్ మారుతుండగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణ మార్పులతో అత్యధిక మందికి ప్రస్తుత సీజన్లో జ్వరం, కళ్ళు ఎర్రగా మారడం, కడుపునొప్పి, శరీరం పై దద్దుర్లు లాంటి లక్షణాలతో అనేక మంది ఆసుపత్రికి వస్తున్నట్లుగా వైద్యులు గుర్తించారు. నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే స్థానిక PHC కి వెళ్లాలని డాక్టర్ నర్మద సూచించారు.