NLR: కావలి మండలం సర్వాయిపాలెం పంచాయతీ తాగేటివారిపాలెంకు చెందిన 56 ఏళ్ల మాజీ సైనికుడు కోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముత్యాలపాడు వైపు బైకుపై వెళ్తుండగా కొత్తపల్లి సమీపంలో గేదెలను తప్పించబోయి అదుపుతప్పి కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.