KNR: హుజురాబాద్ హైస్కూల్ మైదానంలో గల MEO ఆఫీస్ ఆవరణలో నిన్న ఆదివారం రాత్రి మద్యం బాబులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి బీరు సీసాలు, బాటిల్స్ అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం వల్ల ఇవాళ మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులు చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత అధికార్లు స్పదించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.