కృష్ణా: స్వచ్ఛ గ్రామాల సాధనకు ప్రజలు సహకరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం అవనిగడ్డ రోడ్డులోని అమరస్థూపం వద్ధ నిర్వహించారు. డీ.ఆర్.కే.ప్రసాద్ కార్యకర్తలు కలిసి రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త గుట్టలు తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించారు.