BHNG: యాదగిరిగుట్ట యాదాద్రి దేవస్థానంలో ఈనెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాస మహోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 6 బ్యాచ్‌లుగా సత్యనారాయణ వ్రతాలు జరగనున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. సత్యనారాయణ స్వామి టికెట్ వెల రూ.1వేయి గా నిర్ధారించారు.భ క్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో తెలిపారు.