GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సోమవారం పొన్నూరు మండలం చింతలపూడిలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదల మెరుగైన ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. మొత్తం 10 మంది లబ్ధిదారులకు కలిపి రూ. 4,95,966/- విలువైన చెక్కులను అందజేశారు.