తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.66 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.