HYD: హైదరాబాద్లో చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చే ‘ మన్ కొంబ్’ యంత్రం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతుంది. ఇంట్లో వెలువడే తడి చెత్తను ఇందులో వేస్తే ఎరువుగా మారుస్తుంది. కేవలం 8 నుంచి 24 గంటల వ్యవధిలోనే నాణ్యమైన ఎరువుగా మారుస్తున్నట్లు ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. దీని ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొన్నారు.