SKLM: రణస్థలం మండలం వల్లభరావుపేటలో ఉన్న స్మశాన వాటికలో సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో సోమవారం పిచ్చి మొక్కల తొలగింపులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మశాన వాటికకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉండటంతో తన సొంత నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువత, తదితరులు పాల్గొన్నారు.