KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాణ సంచా దుకాణాల వద్ద వ్యాపారులు, వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అగ్నిమాపక, పోలీసు అధికారులు తెలిపారు. దుకాణాల వద్ద నీటి డ్రమ్ముల్లో నీరు నిల్వ చేయాలని, బకెట్లలో ఇసుకను ఉంచాలని, నాణ్యమైన టపాసులు అమ్మాలని కోరారు. చిన్న పిల్లలు టపాసులు కాల్చేటపుడు పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సుచించారు.