దీపావళి పండుగ సందర్భంగా ఇంటింటా లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. అయితే ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి ఉత్తమ సమయమని పండితులు తెలిపారు. అలాగే, దీపావళి రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5.45 గంటల నుంచి 8.15 గంటల వరకు ఉంది. అందువల్ల ఈ సమయాల్లో చేసే పూజలకు, ఆచరించే శుభకార్యక్రమాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.