ADB: కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న ‘ఆది కర్మయోగి అభియాన్’, ‘ధర్తి ఆబా జనభాగిదారీ అభియాన్’ కార్యక్రమాలలో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తెలంగాణ నుంచి ఎంపికైన రెండు జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లా ఒకటిగా నిలవడం గర్వకారణం అన్నారు.